<?xml version="1.0" encoding="UTF-8"?><song><title>పరమున ప్రభువా</title>
<lyrics>[C1]
   పరమున ప్రభువా వరముల నడుగ - నే వెదకితిని నీ పాదములనే

[V1]
 ధనధాన్యములు సర్వసంపదలు
 సర్వ సుఖములు నిను కోరలేదు
 నీ ప్రేమ నీ కరుణ నీ కృపయే చాలు
 నిను గాక నేనేది మరి కోరలేదు

[V2]
 ఇలలోన నా యాత్రను ముగిసి
 పరలోకమును నే చేరువేళ
 వేవేల దూతలు గీతాలు పాడ
 నీపాద కమలాల నను ఒదిగిపోని</lyrics>
<hymn_number>28</hymn_number>
</song>